ఆంధ్ర ప్రదేశ్ దేవాలయాల దాడులపై భక్తులలో ఆందోళన

ఆంధ్రా ప్రదేశ్ లో దేవాలయాలు మళ్లీ మళ్లీ దాడులకు, విధ్వంసాలకు గురవుతున్నాయి. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం యొక్క రథం మంటల్లో దగ్ధమైన విషయం తెలిసిందే. సుదీర్ఘ చరిత్ర ఉన్న స్వామి వారి రథం ఉంచబడిన చోట షార్ట్ సర్క్యూట్ లేదా గదిలో దీపాలు వెలిగించడం వల్ల స్వీయ దహనానికి అవకాశం లేనప్పటికీ అగ్నికి ఆహుతి అవ్వడం ఎన్నో అనుమానాలకు దారి తీసింది. ఈ చర్యలకు పాలుబడిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

2020 లో హిందూ దేవాలయాలపై జరిగిన అనేక దాడులలో ఇది ఒకటి. ఈ సంఘటనపై భక్తులు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం యొక్క రథం అర్ధరాత్రి పూర్తిగా కాలిపోయింది. హిందూ దేవాలయాలకు తరచూ నష్టం వాటిల్లడం వలన వీటి వెనక చాలా అనుమానాలు, భక్తులలో ఆందోళన ఏర్పడుతున్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఆలయ ఇన్చార్జి శ్రీ అర్జున్ రావు ఫోన్ ద్వారా పోలీసు సూపరింటెండెంట్ను సంప్రదించి సంఘటనపై చర్చించారు. పోలీసుల ఫిర్యాదు నమోదై కేసులో దర్యాప్తు జరుగుతోంది.

ఎల్ఆర్పిఎఫ్ (లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం) ఈ సంఘటనల గురించి తెలుసుకుని, ఆంధ్రప్రదేశ్ గవర్నర్కు (ఎపి) లేఖ రాసింది.

ఇంతకుముందు ఎల్ఆర్పిఎఫ్ తమ లేఖలో హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని  కోరుతూ ఎపి హెచ్ఎం శ్రీమతి మేకతోటి సుచరితకు లేఖ రాసినట్లు సూచించింది. అయితే, వారి విజ్ఞప్తి పట్టించుకోలేదని, అందువల్ల వారు గవర్నర్కు తమ విన్నపం సమర్పించామాని చెప్పింది.

వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి వారు కొన్ని సంఘటనలను ఉదహరించారు:

1. 21 జనవరి 2020 – కొంతమంది తెలియని దుండగులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నగరంలో అనేక హిందూ  విగ్రహాలను మరియు ఫ్లెక్స్ బ్యానర్లను అపవిత్రం చేశారు.
2. 5 ఫిబ్రవరి 2020 – గుంటూరు జిల్లాలోని రోంపిచార్ల గ్రామంలో శ్రీ వేణు గోపాల స్వామి ఆలయంలోని విగ్రహాలు ధ్వంసమయ్యాయి మరియు గణేష్ విగ్రహాన్ని కొంతమంది దుండగులు దొంగిలించారు.
3. 13 ఫిబ్రవరి 2020 – నెల్లూరు జిల్లాలోని బొగోల్ మండలంలోని కొండబిత్రగుంట గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వర ఆలయానికి చెందిన రథం అర్ధరాత్రి పూర్తిగా కాలిపోయింది.
4. 28 మార్చి 2020 – తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ గ్రామీణ మండలమైన సూర్యరోపేటలోని రెండు పురాతన హిందూ దేవాలయాలను చర్చి పాస్టర్ జెసిబి యంత్రాన్ని ఉపయోగించి కూల్చివేసి, ఆ తరువాత దేవత యొక్క పురాతన విగ్రహాలను తీసివేసాడు.

దాడుల సరళిలో సారూప్యతను దృష్టిలో ఉంచుకుని నేరపూరిత కుట్రను ఈ లేఖ ఉదహరించింది. హిందూ భక్తుల మధ్య వేదనను పరిశీలిస్తే, నిష్క్రియాత్మకత మత కలహాలకు దారితీస్తుందని ఎల్ఆర్పిఎఫ్ తెలిపింది. అందువల్ల, సమగ్ర దర్యాప్తుతో పాటు, రాష్ట్రంలోని హిందువుల మత మనోభావాలను, దేవాలయాలను పరిరక్షించాలని ఈ లేఖ యొక్క ముఖ్య ఉద్దేశం.

Telugulessaa ద్వారా ఇది ఒక ఆంగ్ల వ్యాసము నుండి తెలుగులోకి అనువదించబడినది.


ఈ వ్యాసం మీకు నచ్చినట్లైతే లాభాపేక్షలేని మా సంస్థకు విరాళం ద్వారా అండగా నిలబడగలరు

హిందూపోస్ట్ ఇప్పుడు టెలిగ్రామ్‌లో లభ్యం. హిందూ సమాజానికి సంబంధించిన సమస్యలపై ఉత్తమ నివేదికలు మరియు అభిప్రాయాల కోసం, టెలిగ్రామ్‌లో హిందూపోస్ట్‌కు సభ్యత్వాన్ని పొందగలరు.